Thursday, May 15, 2025

తెలంగాణలో వృద్ధులకు కొత్త స్కీం

– రేవంత్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం
– ఆరు గ్యారెంటీలతో పాటు ఇది కూడా
– పనుల కార్యాచరణలో దూకుడు
కనిపెంచిన తల్లిదండ్రులను గాలికి వదిలేస్తున్నారు కొందరు పిల్లలు. అల్లారు ముద్దుగా, కంటికి రెప్పలా పెంచిన అమ్మా నాన్నలను మాయమాటలు చెప్పి రద్దీ నగరాల్లో, వీధుల్లో వదిలేసి వెళ్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. ఇదే విషయంపై సీఎం రేవంత్ దృష్టికి పలువురు అధికారులు తీసుకొచ్చారు. దీంతో వృద్ధుల ఆలనా పాలనపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు పలు విప్లవాత్మక కార్యక్రమాలతో దూసుకెళ్తోంది. మరో సంచలన నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికోసం ఓ కార్యక్రమం తీసుకురాబోతోంది తెలంగాణలోని వృద్ధులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా వృద్ధుల కోసం డే కేర్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా వృద్ధుల కోసం ప్రతి జిల్లాలో ఒక డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయనుంది సీఎం రేవంత్ సర్కార్. ఈ మేరకు కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ మధ్య తమ పిల్లలు వదిలివేశారంటూ రోదిస్తున్న ఘటనలు చాలా చూశాం.. అలా ఒంటరైన వృద్ధులు మనోవేదన చెందకుండా వారికి చేయూతనిచ్చే దిశగా ముందుకెళ్తున్నది ప్రభుత్వం. సామాజిక సంరక్షణతోపాటు మానసిక ఉల్లాసానికి బాటలు వేసేలా డే కేర్ సెంటర్‌లను నిర్మించాలని ప్రణాళికలు వేస్తోంది. ప్రతి జిల్లాలో ఓ డే కేర్ సెంటర్ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో దాదాపుగా 9 లక్షల మంది సీనియర్​సిటిజన్స్ ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ డే కేర్ సెంటర్ల ద్వారా వృద్ధులు మనోధైర్యంగా ఉంటారని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ డే కేర్ సెంటర్లు నిర్మించేందుకు.. జిల్లా కేంద్రాల్లో ఏమైనా ప్రభుత్వ భవనాలు నిరుపయోగంగా ఉన్నాయా? లేదా అన్నవాటిపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. వాటికి మరమ్మతులు చేస్తే వృద్ధులకు సౌకర్యాలు కల్పించవచ్చా? అని పరిశీలిస్తోంది. అయితే.. భవనాలు లేని చోట కొత్తవి నిర్మించాలా లేక అద్దె భవనాలు తీసుకోవాలా అన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com