రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలు డ్యాన్సులు, మందు, పబ్‌లు, హోటళ్లలోనే కాదు.. లక్ష మంది యువత ఓయో రూముల్లో సేద తీరారు. కేవలం హైదరాబాద్‌లోనే ఒక్కరోజే 10 లక్షల ఓయో రూమ్స్ బుక్ చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకలు రాష్ట్రంలో ఘనంగా జరిగాయి. ఈసారి వేడుకలను యువత గ్రాండ్‌గానే సెలబ్రేట్ చేసుకున్నారు. యూత్‌ను ఆకట్టుకోవడానికి రకరకాల ఈవెంట్స్ పేరుతో పబ్‌ల యాజమానులు ముందుకొచ్చారు. ఇదిలా ఉంటే న్యూ ఇయర్ వేడుకల సమయంలో ఓయో రూమ్స్ బుకింగ్ కూడా రికార్డు స్థాయిలో జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. యూత్ ఎక్కువగా ఓయో రూమ్స్ బుకింగ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రేమికులు పార్క్‌లను తమ అడ్డగా మార్చుకునేవారు. కానీ కాలక్రమేణ లవర్స్ ఏకాంతంగా గడపటానికి ఎక్కువగా ఓయో రూమ్స్‌ను తమకు బెస్ట్ ఛాయిస్‌గా ఎంపిక చేసుకుంటున్నారు. ” ఓయో రూమ్స్ లవర్స్‌గా అడ్డగా మారిపోయిందనే చెప్పాలి. ఓయో రూమ్స్ పట్ల సమాజంలో ఏ రకమైన భావన ఉందో అందరికీ తెలిసిందే. నార్మల్ ఫ్యామిలీస్ ఓయో రూమ్ అంటేనే అసహ్యించుకునే రోజులు వచ్చాయి. అసాంఘిక కార్యకలాపాలకు ఓయో రూమ్స్ అడ్డాగా మారాయి. వ్యక్తిగత సమాచారంతో పాటు, ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాతే రూం ఇవ్వడం జరుగుతోంది. తాజాగా జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో ఓయో రూమ్స్‌కు ప్రేమికులు క్యూ కట్టారు. ఇదే సమయంలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి చాలామంది గ్రామాల నుంచి వారు కూడా ఓయో రూమ్స్ బుక్ చేసుకున్నారు. 10 లక్షల మందికి పైగానే ఓయో రూమ్స్ బుక్ చేసుకున్నట్టు యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.