రేవ్ పార్టీ కలకలం – పోలీసుల అదుపులో ఐదుగురు మహిళలు
పోలీసుల అదుపులో ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులు
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపింది. కోరుకొండ మండలం బూరుడుపూడి గేట్ సమీపంలోని కల్యాణ మండపంలో తెల్లవారుజామున రేవ్ పార్టీపై పోలీస్ ప్రత్యేక సిబ్బంది దాడి చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్న ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నిందితులు ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి చెందిన వారిగా సమాచారం. వారు గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.