Saturday, April 5, 2025

డీజీపీ,హైదరాబాద్ సీపీకి ఎన్​ హెచ్​ ఆర్​ సీ నోటీసులు

సంధ్య థియేటర్‌ ఘటనపై నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాల ఆదేశం

డీజీపీ జితేందర్​, హైదరాబాద్‌ పోలీస్​ కమిషనర్​ సీవీ ఆనంద్​ కు జాతీయ మానవహక్కుల కమిషన్‌ బుధవారం నోటీసులు జారీ చేసింది. సంధ్య థియేటర్‌ ఘటనపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నది. సీనియర్‌ ర్యాంక్‌ పోలీస్‌ అధికారితో విచారణ జరపాలని ఆదేశించింది. ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని చెప్పింది. డిసెంబరు 4న పుష్ప-2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఘటనపై న్యాయవాది రామారావు జాతీయ మానవ హక్కుల కమిషన్​ కు ఫిర్యాదు చేశారు.

ప్రీమియర్‌ షోకి హీరో అల్లు అర్జున్‌ రావడం, పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతోనే థియేటర్​ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి మృతి చెందిందని, బాలుడికి తీవ్ర గాయాలయ్యాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మానవ హక్కుల కమిషన్‌ సంధ్య థియేటర్‌ ఘటనపై సీనియర్‌ ర్యాంక్‌ పోలీసు అధికారితో విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని నోటీసుల్లో కమిషన్ పేర్కొంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com