మెగా డాటర్ నిహారిక తన భర్త చైతన్య నుంచి విడిపోవడం గురించి తెలిసిందే. ప్రస్తుతం నిహారిక తన కెరీర్‌పై దృష్టి సారించింది. నిర్మాతగా, నటిగా జోడు గుర్రాల ప్రయాణాన్ని అద్భుతంగా సాగిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో విడాకులతో తన కలత గురించి మాట్లాడింది. సెలబ్రిటీ హోదాతో సంబంధం లేకుండా, విడాకులు ఏ స్త్రీకైనా బాధాకరమైన అనుభవం అని నిహారిక అంగీకరించింది. “విడాకుల గురించి ఆలోచిస్తూ ఎవరూ పెళ్లి బంధంలోకి ప్రవేశించరు. కానీ కొన్నిసార్లు పరిణామాలు వేరుగా ఉంటాయి. కొన్ని అదుపు తప్పుతాయి. కష్టమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది“ అని తెలిపింది. జీవితంలో సవాళ్ల నుంచి చాలా నేర్చుకునేందుకు ఆస్కారం ఉంది. నిహారిక బాధాకరమైన ఘటన నుంచి బయటపడి పూర్తిగా సినిమా కెరీర్ పై దృష్టి సారించారు. ఇటీవల `కమిటీ కుర్రోళ్ళు` సినిమాను నిర్మించింది. తమిళ చిత్రం `మద్రాస్కారన్` బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోలేదు. `వాట్ ది ఫిష్`లో గ్లామరస్ పాత్రతో నిహారిక మెరిపించనుంది.