Thursday, December 26, 2024

నీ.. తగ్గేదే లే పుష్ప పోస్టర్‌ బంపర్‌

తగ్గేదేలే… ప్రస్తుతం ఎక్కడ చూసిన ట్రెండీ డైలాగ్‌ ఇది. అల్లుఅర్జున్‌ నటించిన పుష్ప చిత్రంలోని ఈ డైలాగ్‌ ఎంత ఫేమస్‌ అయిందో అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం రెండవ పార్ట్‌ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 చిత్రం నుంచి కొత్త పోస్టర్లు విడుదలవుతున్నాయనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. అల్లు అర్జున్, రష్మిక మందన్నా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మరోసారి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్నాతో పాటు ఫహద్ ఫాసిల్, దేవరాజ్, సునీల్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.పుష్ప: ది రైజ్ సినిమా భారీ విజయం సాధించడంతో పుష్ప 2 సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగాయి. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల కానుండటంతో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పుడు కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్న పోస్టర్ ను రిలీజ్ చేసి. ఇంకా సినిమా విడుదలకు నెల రోజులే ఉంది అంటూ అభిమానులకు మరోసారి గుర్తు చేశారు. దాంతో ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు ప్రకారం జరిగితే ఈ సినిమా డిసెంబర్ 5, 2023 న విడుదల కానుంది. పుష్ప రాజ్ అడవుల స్మగ్లర్ కథగా మొదలైన ఈ సినిమా రెండో భాగంలో పుష్ప తన శత్రువులతో ఎలా పోరాడుతాడు, అతని జీవితంలో ఎలాంటి మలుపులు వస్తాయి అనేది ఆసక్తికరంగా ఉండనుంది.

ఇక పోస్టర్‌ విషయానికి వస్తే అల్లుఅర్జున్‌, ఫహద్‌ ఫాసిల్‌ ఒకరికి ఒకరు రెఢీనా.. అంటే రెఢీ అన్నట్లు ఉన్న పోస్టర్‌ మంచి హైప్‌ని క్రియేట్‌ చేస్తుంది. ఇక ఫస్ట్‌ పార్ట్‌ ఎండింగ్‌ వీరిద్దరి ఛాలెంజింగ్‌ తో ముగుస్తుంది. ఫహద్‌ అల్లు అర్జున్‌ పై కక్ష ఎలా సాధిస్తాడు ఏంటి అనేది సెకండ్‌ పార్ట్‌లో చూడడానికి ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com