అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య
మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఈరవత్రి అనీల్
పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టుల భర్తీ…34 క్పారేషన్లకు ఛైర్మన్‌ల నియామకం
ఎంతో కాలంగా ఊరిస్తూ వొస్తున్న నామినేటెడ్ పదవులను కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు భర్తీచేసింది. పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. టీఎస్‌ఐఐసీ చైర్‌పర్సన్‌గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలా రెడ్డిని నియమించింది. అదే విధంగా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనీల్‌ను మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించింది. మొత్తం 34 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జీవో విడుదల చేశారు. వీరంతా రెండేండ్ల పాటు పదవుల్లో కొనసాగనున్నారు.
ఇందులో భాగంగా విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అన్వేష్ రెడ్డి, ఆగ్రో పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కాసుల బాలరాజు, జంగా రాఘవరెడ్డి- ఆయిల్ సీడ్స్ అభివృద్ధి సంస్థ, మానాల మోహన్‌రెడ్డి- రాష్ట్ర సహకార సంఘం చైర్మన్, రాయల నాగేశ్వరరావు- గిడ్డంగుల సంస్థ చైర్మన్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్- ముదిరాజ్ కార్పొరేషన్, మెట్టు సాయికుమార్- మత్స్య సహకార సమాఖ్య, రియాజ్- గ్రంథాలయ పరిషత్, పొదెం వీరయ్య- అటవీ అభివృద్ధి సంస్థ, కాల్వ సుజాత- ఆర్యవైశ్య కార్పొరేషన్, గురునాథ్ రెడ్డి- పోలీసు హౌసింగ్ కార్పొరేషన్, గిరిధర్ రెడ్డి- సెట్విన్ చైర్మన్, జనక్ ప్రసాద్- కనీస వేతనాల అడ్వైజరీ బోర్డ్, విజయ బాబు- వ్యవసాయాభివృద్ధి కార్పొరేషన్, రాయుడు సత్యనారాయణ- హాండిక్రాప్టస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, అనితా ప్రకాశ్ రెడ్డి- ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, మన్నె సతీశ్ కుమార్- టెక్నాలజీ సర్వీసెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, జబ్బార్- మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, అలేఖ్య పుంజాల- సంగీత నాటక అకాడవి•, ఈరవత్రి అనీల్- మైనింగ్ కార్పొరేషన్, పల్లా నర్సింహారెడ్డి- అర్బన్ డెవలప్‌మెంట్, ఇనగాల వెంకట్రామిరెడ్డి- కుడా చైర్మన్, నరేందర్ రెడ్డి- శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, పటేల్ రమేశ్ రెడ్డి- స్టేట్ టూరిజమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఎంఏ ఫహీమ్- తెలంగా
ణ ఫుడ్స్ బండారు శోభారాణి- ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఎం. వీరయ్య- వికలాంగుల కార్పొరేషన్, కే.శివసేనా రెడ్డి- స్పోర్టస్ అథారిటీ, ఎన్. ప్రీతమ్- షెడ్యూల్డ్ క్యాస్ట్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, నూతి శ్రీకాంత్- బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, బెల్లయ్య నాయక్- ఎస్టీ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, కే. తిరుపతి- గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్, జే. జైపాల్- వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థలకు చైర్మన్లుగా నియమితులయ్యారు.