Monday, March 10, 2025

Union Budget 2025: చేనేత చీరలో నిర్మలమ్మ

బడ్జెట్ 2025 సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరపై ఇప్పుడు పెద్దఎత్తున ఆసక్తి నెలకుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపటేలా ప్రతి ఏటా బడ్జెట్ రోజున నిర్మల ప్రత్యేకంగా రూపొందించిన చీరను ధరిస్తారు.

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం బడ్జెట్ 2025-26) ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈసారి ఆమె సమర్పించే బడ్జెట్‌తో వరసగా ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా చరిత్ర లిఖించనున్నారు. అయితే ప్రతి ఏటా ఆమె ప్రవేశపెట్టే బడ్జెట్‌తోపాటు కేంద్రమంత్రి ధరించే చీరపైనా పెద్దఎత్తున ఆసక్తి నెలకొంటుంది.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపటేలా ప్రతి ఏటా బడ్జెట్ రోజున నిర్మల ప్రత్యేకంగా రూపొందించిన చీరను ధరిస్తారు. అలాగే ఈ ఏడాది కూడా బంగారు వర్ణం అంచుతో ఉన్న క్రీమ్ కలర్ రంగు చేనేత చీరను నిర్మలా సీతారామన్ ధరించారు. ఆమె సాధారణంగా బడ్జెట్ వేళ చేనేత చీరలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈసారి ధరించిన చీరలో బిహార్ రాష్ట్రం మధుబని కళకు చెందిన చిత్రాలు కనిపిస్తున్నాయి.

కాగా, పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారి దేవి Padma Shri awardee Dulari Devi ఈ చీరను నిర్మలకు 2021లో బహుమతిగా ఇచ్చారు. ఆ చీరనే నేడు కేంద్ర మంత్రి ధరించారు. మిథిలా ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో క్రెడిట్ అవుట్‌రీచ్ యాక్టివిటీ కోసం కేంద్రమంత్రి ఓసారి మధుబనీకి వెళ్లారు. అక్కడ దులారి దేవిని నిర్మల కలిశారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రమంత్రికి చీరను బహుమతిగా ఇచ్చారు. కాగా, ప్రస్తుతం బడ్జెట్‌పై ఎంత ఆసక్తి నెలకొందో ఆర్థిక మంత్రి నిర్మల కట్టుకున్న చీరపైనా అంతే ఆసక్తి నెలకొంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com