Monday, March 31, 2025

శ్రీవారి సేవలో ‘రాబిన్‌హుడ్‌’ హీరో

హీరో నితిన్ తిరుమ‌ల స్వామివారిని ద‌ర్శించుకున్నారు. శుక్ర‌వారం వీఐపీ ప్రారంభ విరామ ద‌ర్శ‌న స‌మ‌యంలో శ్రీకాళ‌హ‌స్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో క‌లిసి ఆయ‌న శ్రీవారి సేవ‌లో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. ద‌ర్శ‌నం అనంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలో నితిన్‌కు వేద పండితులు ఆశీర్వ‌చ‌నం చేసి శ్రీవారి తీర్థ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. నితిన్ న‌టించిన కొత్త సినిమా ‘రాబిన్‌హుడ్’ థియేటర్లలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. నితిన్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా యంగ్ బ్యూటీ శ్రీలీల న‌టించ‌గా… ఆసీస్ మాజీ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ అతిథి పాత్ర‌లో నటించ‌డం విశేషం.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com