Sunday, April 6, 2025

నిత్యానందస్వామి బ్రతికే ఉన్నాడు

వివాదాస్ప‌ద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి జీవ స‌మాధి అయిన‌ట్లు ఆయ‌న మేన‌ల్లుడు సుందరేశ్వ‌ర్ వెల్ల‌డించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియా అంతటా బాగా హ‌ల్‌చ‌ల్ చేసింది. ఇక ఈ వార్త‌తో ఆయ‌న భ‌క్తులు, అనుచ‌రులు శోక సంద్రంలో మునిగిపోయారు.
అయితే, నిత్యానంద చ‌నిపోలేదని ఆయ‌న ప్ర‌క‌టించుకున్న కైలాస దేశం తాజాగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం ఆయ‌న సుర‌క్షితంగా, చురుకుగా ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. అంతేగాక నిత్యానంద బతికే ఉన్నాడని రుజువుగా మార్చి 30న ఆయ‌న ఉగాది వేడుకల్లో పాల్గొన్న ప్రత్యక్ష ప్రసార లింక్‌ను త‌న‌ ప్రకటనకు కైలాస దేశం జత చేసింది. దురుద్దేశపూరితంగానే కొంద‌రు ఇలాంటి ప్రచారం చేస్తున్నార‌ని త‌న‌ ప్రకటనలో పేర్కొంది. ఇక 2019లో అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన నిత్యానంద ద‌క్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌ సమీపంలో ఓ దీవిని సొంతం చేసుకుని దానికి కైలాస దేశంగా నామ‌క‌ర‌ణం చేశారు. ఇప్పుడు అక్క‌డే ఉంటున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com