Tuesday, May 13, 2025

చక్కనైన చీరకట్టుతో నివేదా

తెలుగు సినిమాలలో గృహిణి పాత్రలలో ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ అందరూ నటించి మెప్పించారు. ముఖ్యంగా మధ్య తరగతి గృహిణి పాత్రలు అంటే రమ్యకృష్ణ, సౌందర్య లాంటి హీరోయిన్స్ వెంటనే గుర్తుకొస్తారు. ఆ పాత్రలకి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఈ స్టార్ హీరోయిన్స్ వన్నె తెచ్చారు. ఒకప్పుడు మన తెలుగు సినిమా కథలు కూడా మధ్యతరగతి కుటుంబాల నేపథ్యంలో ఉండేవి. వాటికి తగ్గట్లుగానే ఆ పాత్రలకి ప్రాణం పొసే హీరోయిన్స్ ని దర్శకులు ఎంపిక చేసుకునేవారు. వీరి తర్వాత లయ గృహిణి పాత్రలలో నటించి మెప్పించి. ఆమె తర్వాత మధ్యతరగతి కుటుంబాల నేపథ్యంలో మన దర్శకులు సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించేశారు.

అందుకు తగ్గట్లుగానే హీరోయిన్స్ ఎవరు కూడా అలాంటి పాత్రలలో కనిపించలేదు. అయితే రానా దగ్గుబాటి నిర్మాతగా సురేష్ ప్రొడక్షన్స్ లో 35 అనే మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్ అచ్చమైన తెలుగింటి మధ్యతరగతి గృహిణి క్యారెక్టర్ లో నటించింది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకొచ్చి అందరికి కనెక్ట్ అయ్యింది. ఈ చిత్రంలో నివేదా థామస్ ఇద్దరు పిల్లల తల్లిగా నటించింది. పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు పడే ఇబ్బందులు, కుటుంబ బంధాలు, బాధ్యతలని ఈ సినిమాలో చక్కగా చూపించినట్లు కనిపిస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com