మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) స్కాంలో కర్టాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్ లభించింది. ముడా ద్వారా స్థలాల కేటాయింపులో సీఎం సిద్ధరామయ్య భూ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ న్యాయవాది-కార్యకర్త టిజె అబ్రహం ఫిర్యాదు చేశారు.దీంతో సిద్ధరామయ్యపై విచారణ జరిపేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య రాష్ట్ర హైకోర్టను ఆశ్రయించారు. సిఎం వేసిన పిటిషన్ ను కోర్టు విచారించింది. ముడా కేసులో సీఎం సిద్దరామయ్యపై విచారణ జరపడానికి గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని సీఎం తరఫు న్యాయవాదులు హైకోర్టు తెలిపారు. అసలు ఈ విషయంలో ఆయన ఎలాంటి కారణం చూపలేదన్నారు. గవర్నర్ క్యాబినెట్ నివేదికలకు కట్టుబడి ఉండాలని, సిద్దరామయ్య విషయంలో ఆయన చట్టవిరుద్ధంగా విచారణకు ఆదేశించారని వాదించారు. దీంతో తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు సిద్ధరామయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ తీర్పు చెప్పింది.