Friday, April 18, 2025

మెట్రోరైలు ప్రయాణ వేళల్లో ఎలాంటి మార్పులు చేయలేదు

ప్రయాణికులెవరూ మెట్రో రైళ్ల సమయాల్లో అయోమయానికి గురికావద్దు
హైదరాబాద్ మెట్రోరైలు ప్రయాణ వేళల్లో మార్పుల విషయమై జరుగుతున్న ప్రచారాన్ని మెట్రోరైలు అధికారులు శనివారం ఖండించారు. మెట్రో ప్రయాణ సమయాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని వారు వెల్లడించారు. మెట్రో రైళ్లు ఎప్పటి మాదిరిగానే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య నడుస్తాయని అధికారులు స్పష్టం చేశారు. మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని అధికారులు ఖండించారు.

ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే రైళ్ల రాకపోకలు మొదలవుతాయని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రయల్ మాత్రమే చేశామని, ఇంకా ఆ వేళల్లో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఎల్ అండ్ టి వెల్లడించింది. ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్ నిర్వహణ సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులెవరూ మెట్రో రైళ్ల సమయాల్లో అయోమయానికి గురికావద్దని, యథావిధిగా నిర్దిష్ట సమయానికే రాకపోకలు ఉంటాయని మెట్రోరైలు వర్గాలు సూచించాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com