తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం
జనాభా ప్రాతిపదిక డీలిమిటేషన్ చేపడితే రాష్ట్రాల మధ్య వైషమ్యాలు వస్తాయని తెలంగాణ తీర్మానం చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు చేసిన తర్వాత ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. “ఇప్పుడు గంభీరమైన వాతావరణం, ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీలు అన్నీ కలిసి కేంద్రం చర్యలు ఎదుర్కోవాలని తీర్మానించాం. ఇందిరాగాంధీ, వాజ్‌పేయీ సవరణ చేసినట్టుగానే ఇప్పుడు కూడా మళ్లీ మరో పాతికేళ్ల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రమంత్రులు చెబుతున్నారు. అందుకే ఈ సభలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించాలని నిర్ణయించాం. కేంద్రం ఆదేశాలతో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ చట్టాలను పక్కగా అమలు చేశాయి. ఉత్తరాది రాష్ట్రాలు దాన్ని పట్టించుకోలేదు. అందుకే అక్కడ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ” అని సీఎం పేర్కొన్నారు.