Sunday, April 6, 2025

అభిమానులను కంట్రోల్‌ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే

  • శాంతిభద్రతల‌పై రాజీపడే ప్రసక్తే లేదు
  • బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇచ్చేది లేదు: సీఎం రేవంత్‌రెడ్డి

శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని సీఎం రేవంత్‌ రెడ్డి  స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్లపై విషయంలో సీరియస్‌గా ఉంటామన్నారు. టికెట్ల పెంపు, బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. అసెంబ్లీలో చేసిన ప్రకటనకే కట్టుబడి ఉంటామన్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సినీ ప్రముఖులతో జ‌రిగిన స‌మావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

పరిశ్రమ అభివృద్ధికి, ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని చెప్పారు. తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలన్నారు. ఒక మహిళ ప్రాణం పోవడంతోనే సంధ్య థియేటర్‌ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నదని చెప్పారు. ఎవరిపై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టలేదన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com