Monday, April 21, 2025

సీక్వెల్స్‌ అంటే భయం…కానీ..

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో ‘సారంగపాణి జాతకం’ చిత్రం తెరకెక్కింది. ప్రియదర్శి, రూపా కొడువయూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ముచ్చటిస్తూ…కొన్ని ఆయన గత సినిమా అనుభవాల గురించి పంచుకున్నారు. ప్రస్తుతం కొన్ని కథల మీద చర్చిస్తున్నాం. నాకు సీక్వెల్స్ అంటే చాలా భయం. అందుకే నేను వాటికి దూరంగా ఉంటాను. కానీ బాలకృష్ణ మాత్రం ‘ఆదిత్య 369‘ సీక్వెల్ పనులు స్టార్ట్ చేస్తే దానిలో భాగం అవుతాను. ‘యశోద‘ డైరెక్టర్లు చెప్పిన రెండు కథలు నాకు చాలా నచ్చాయి. పవన్ సాధినేని చెప్పిన ఓ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మళ్లీ మోహనకృష్ణ ఇంద్రగంటితో ఇంకో సినిమా చేయబోతున్నాను. అన్నీ ఫైనల్ అయ్యాక అన్ని ప్రాజెక్టుల గురించి అధికారికంగా ప్రకటిస్తాను.

 

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com