ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ప్రియదర్శి, రూపా కొడువయూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే.. ఒకప్పుడు మూడు నెలల్లో సినిమా పూర్తయ్యేది. అప్పట్లో మేం ఒక హీరోతో చేసిన తరువాత ఇంకో హీరోతో సినిమాను ప్లాన్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు ఒక్కొక్కరు నాలుగైదు ప్రాజెక్టులని లైన్‌లో పెడుతున్నారు. అంతా కాంబినేషన్స్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ కథల గురించి పట్టించుకోవడం లేదు. నాకు సినిమాల పట్ల ఎక్కువ ప్యాషన్ ఉంటుంది. అందుకే నేను తీసిన ఆదిత్య 369 అయినా, జెంటిల్‌మెన్ అయినా, సమ్మోహనం అయినా, యశోద అయినా నా మార్క్ కనిపించాలని కోరుకుంటున్నాను. సారంగపాణి జాతకం చిత్రంలోని ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటారు.