Saturday, January 4, 2025

ప్రజా భవన్​ పనికి రాదా.. వాస్తు లేదా..?

సీఎం క్యాంపు ఆఫీస్​ కొత్తదే
సర్కారు మారినప్పుడల్లా కొత్తది కట్టాల్సిందేనా

“ అవసరమైతే రేకుల షెడ్డులోనైనా ఉంటా కానీ.. ప్రజా భవన్​లో ఉండా..”

సీఎం రేవంత్​ రెడ్డి చేసిన తాజా కామెంట్​ ఇది. మొన్నటిదాకా వందల కోట్లు దుర్వినియోగం చేసి ప్రగతి భవన్​ కట్టారని, పాత కార్యాలయాలను కూల్చివేస్తూ ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆరోపణలు చేసిన కాంగ్రెస్​ పార్టీ.. ఇప్పుడు అధికారంలోకి రాగానే అదే పంథాలో పరుగులు పెడుతున్నది. ప్రగతిభవన్​ను ప్రజాభవన్​గా మార్చిన సీఎం రేవంత్​రెడ్డి.. అక్కడకు వెళ్లనంటూ స్పష్టం చేశారు. ఎంసీఆర్​హెచ్​ఆర్​డీలో చిన్న రేకుల షెడ్డు అయినా వేసుకుని సీఎం క్యాంపు ఆఫీస్​ నిర్వహిస్తామని, అంతేకానీ, ప్రజా భవన్​లో ఉండనంటూ తేల్చి చెప్పారు. ఇక్కడ ఉన్న మరో సముదాయాన్ని మరో మంత్రికి కేటాయిస్తున్నట్లు కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి మీడియాతో చిట్​చాట్​ నిర్వహించారు.

అసెంబ్లీ భవనాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామని, కొత్తవి కట్టబోమమని చెప్పారు. వాటినే పార్లమెంటు తరహాలో అభివృద్ధి చేస్తామని, జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ లో ఖాళీగా ఉన్న భవనాన్ని మరో మంత్రికి కేటాయించనున్నట్టు సీఎం చెప్పారు. ఎంసీహెచ్ ఆర్డీ ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలంలో సీఎం క్యాంప్ ఆఫీసు నిర్మిస్తామని, బీఆర్ఎస్ ప్రభుత్వం రోజుకు 12 నుంచి 14 గంటల కరెంటు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. శ్వేతపత్రాలు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించిన తర్వాత సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని చెప్పారు. శుక్రవారం బీఏసీ సమావేశం నిర్వహిస్తున్నామని, శాసనసభ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పాత అసెంబ్లీ భవనంలో శాసన మండలి సమావేశాల, ఇప్పుడున్న అసెంబ్లీలో శాసన సభ సమావేశాలు జరుగుతాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో మార్గం విస్తరణతో పెద్దగా ఉపయోగం ఉండదని సీఎం అభిప్రాయపడ్డారు. మరో రూట్ లో మెట్రో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

పాతది పనికిరాదా..?
నిజానికి, బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో ప్రగతి భవన్​ అత్యంత కీలకం. సీఎం క్యాంపు ఆఫీస్ ​అదే. అటు వైపు వెళ్లాలంటేనే ఒక విధమైన హడల్​. దానిపై చాలా విమర్శలు వచ్చాయి. 9 ఎకరాల విశాల స్థలంలో ప్రగతిభవన్​ను అప్పటి సీఎం కేసీఆర్​ నిర్మించుకున్నారు. అయితే, దానిపై చాలా విమర్శలు చేసిన కాంగ్రెస్​ నేతలు.. ఇప్పుడు అధికారంలోకి రాగానే మళ్లీ కొత్త భవనాన్ని నిర్మించుకుంటామని ప్రకటించారు. దీంతో వందల కోట్లు వెచ్చించి నిర్మించిన గత ప్రగతిభవన్​.. నేటి ప్రజా భవన్​ ఎందుకు పనికి రాదో అనేదే ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్న. ఇలా ప్రభుత్వం మారినప్పుడల్లా కొత్త భవనాలు నిర్మించుకుంటే వందల కోట్ల ప్రజాధనం వృథా అవుతున్నట్టేననే టాక్​ మొదలైంది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com