టీఎస్ న్యూస్: నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిని అధికారులు సీజ్ చేశారు. ఆ విషయం తెలుసుకుని.. హైదరాబాద్ నుంచి హాలియా మీదుగా నాగార్జున సాగర్ బయల్దేరిన ఈ మాజీ ఎమ్మెల్యేను.. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అలీనగర్ వద్ద అడ్డుకున్న పోలీసులు అడ్డుకున్నారు. రాజకీయ కక్ష సాధింపులు భాగంగానే.. అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు.. కావాలనే తన ఇల్లు సీజ్ చేశారని నోముల భగత్ మండి పడ్డారు.