Friday, May 2, 2025

జగన్‌కి గాయం… ఇండస్ట్రీ మౌనం

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం విషయంలో తెలుగు సినీ పెద్దల వైఖరి ఏమిటి అన్నది ఇపుడు చర్చకు వస్తోంది. ఏపీలో గత అయిదేళ్ల వైసీపీ అధికారంలో సినీ రంగానికి పెద్దగా ఒరిగింది ఏదీ లేదన్న భావన వారిలో ఉందని అంటున్నారు. మొదటి నుంచి సినీ రంగం పై వైసీపీ కాస్త నిర్లక్ష్యంగానే వ్యవహరించిందని కూడా చెప్పవచ్చు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, 2019 ఎన్నికల ముందు చాలా మంది సినీ ప్రముఖులు వైసీపీకి మద్దతుగా నిలిచారు. వారంతా వైసీపీకి అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. కానీ పార్టీలో మాత్రం ఆ తరువాత ఎవరికీ పెద్దగా పదవులు దక్కింది లేదని అంటారు. దాంతో వారంతా తొందరలోనే వైసీపీకి దూరం అయ్యారు. ఇక పోసాని క్రిష్ణ మురళి ఒక్కడే ఈ రోజుకీ వైసీపీ వాయిస్ గా ఉన్నారు. అలీకి ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ పదవిని ఇచ్చారు. కానీ ఆయన ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటుని కోరుకున్నారు. కానీ ఆయనకు ఇవ్వలేదు. దాంతో నాటి నుంచి అలీ మౌనంగానే ఉంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే గత శనివారం రాత్రి జగన్ మీద రాళ్ల దాడి జరిగింది.

దాంతో దేశవ్యాప్తంగా చర్చ సాగింది. దేశ ప్రధాని నుంచి పలువురు ముఖ్యమంత్రుల దాకా అంతా జగన్ కి పరామర్శ చేశారు కోలుకోవాలని ఆకాక్షించారు. ఏపీలో అయితే టీడీపీ అధినేత చంద్రబాబు చాలా లేట్ గా రియాక్ట్ అయ్యారు అని వైసీపీ నుంచి విమర్శలు వచ్చాయి. ప్రధాని మోడీ పరామర్శ తరువాతనే బాబు స్పందించారు అని అప్పటికీ ఆయన పార్టీ టీడీపీ కోడి కత్తి డ్రామా అంటూ విమర్శలు చేస్తూనే ఉంది అని గుర్తు చేశారు. ఇక జనసేన అధినేత పవన్ అయితే తెనాలి సభలో జగనే రాయి వేయించుకుని ఉంటారు అని హాట్ కామెంట్స్ చేశారు. దాని మీద సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇవన్నీ పక్కన పెడితే టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ ఒక ముఖ్యమంత్రికి గాయం అయితే ఎందుకు రియాక్ట్ కాలేదు అన్న చర్చ నడుస్తోంది. దానికి కారణం జగన్ ప్రభుత్వం అయిదేళ్ళ కాలంలో సినీ పరిశ్రమను ఇబ్బందులు చాలానే పెట్టిందని అందుకే వారు కీలక వేళలో మౌనం దాల్చారు అని అంటున్నారు. సినీ ప్రముఖులు అంతా కలసి జగన్ వద్దకు వెళ్లి టాలీవుడ్ సమస్యలు ఏకరువు పెట్టినా ఆశించిన స్థాయిలో స్పందన లేదని కూడా ఒక రకమైన భావన వారిలో ఉందని అంటున్నారు.

మరో వైపు చూస్తే సినీ రంగం నుంచి పవన్ కళ్యాణ్ జనసేన తరఫున ఈసారి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన అన్న మెగాస్టార్ ఇండైరెక్ట్ గా జనసేన కు మద్దతుగా ఉంటున్నారు. ఇక ఇండైరెక్ట్‌ ఏంటి డైరెక్ట్‌ ఏంటి వారిద్దరూ అన్నదమ్ములు అంటే కామన్‌గా సపోర్ట్‌ అనేది ఉంటది అందరికీ తెలిసిన విషయమే. దాంతో మెగా ఫ్యామిలీ ఎటు వైపు చూసిన వారు అంతా మౌనంగా ఉండడమే బెటర్ అని రియాక్ట్ కాలేదని అంటున్నారు. అదే విధంగా చూస్తే టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీకి మంచి పలుకుబడి ఉంది. బాలయ్య టీడీపీ తరఫున పోటీ చేస్తూ ప్రచారంలో ఉన్నారు. దాంతో టాలీవుడ్ లో పట్టున్న రెండు వర్గాలు కీలక నటులు అంతా ఒక వైపు ఉండడంతో మిగిలిన వారు కూడా ఎందుకొచ్చిన గొడవ అని జగన్ గాయం విషయంలో మౌనం పాటించారు అని అంటున్నారు. ఇక చూస్తే ఏపీలో రాజకీయం మారుతుందని అంతా ఆశిస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు. అయితే ఒకవేళ రాజకీయం మారకపోతే మాత్రం అప్పుడు ఎలా ఉంటుంది ఈనాటి మౌనానికి అపుడు సమాధానం ఎలా చెప్పుకుంటారు అన్నది కూడా వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్నలు. ఏది ఏమైనా టాలీవుడ్ కి వైసీపీకి మధ్య గ్యాప్ అయితే బాగానే ఉందని అంటున్నారు. దానికి ఈ ఘటన రుజువుగా ఉందని అంటున్నారు.

అంతేకాకుండా ఒకానొక సమయంలో పవన్‌ సినిమాలు అన్నీ కూడా ఏపీలో విడుదల కాకుండా ఆపించడం కూడా జరిగింది. అదే విధంగా టికెట్ రేట్లు కూడా అక్కడ పెద్దగా పెంచడానికి అక్కడి ప్రభుత్వం నిరాకరించింది. ఇక ఇటీవలె రామ్‌గోపాల్‌ వర్మ తీసిన కొన్ని చిత్రాలను కూడా ఏపీలో నిలిపివేయడం జరిగింది. మరి ఇలాంటి ఘటనలన్నీ ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీ పెద్దగా మద్దతుగా నిలిచినట్లు కనిపించడం లేదు. మరి ఇకముందు వైసీపీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో వేచి చూడాలి.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com