సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఏడాది ముగ్గురు స్టార్ హీరోలు పోటీపడ్డ విషయం తెలిసిందే. అందులో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం, బాలకృష్ణ డాకు మహారాజ్ రెండు రోజుల తేడాతో మూడు సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలయ్యాయి. అయితే ఇందులో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా.. డాకు మహారాజ్ ఇటీవలే సక్సెస్ ఈవెంట్ కూడా నిర్వహించుకుంది. మరొకవైపు వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఐదు రోజుల్లోనే రూ.161 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో మరోవైపు ఊర్వశీ రౌతేలా , కియారా అద్వానీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. డాకు మహారాజ్ సినిమా విజయం తర్వాత ఊర్వశి గేమ్ ఛేంజర్ సినిమా పరాజయంపై వ్యాఖ్యలు చేయడంతో చరణ్ అభిమానులు ఆమెపై పూర్తిస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఊర్వశీ మాటలకు మెగా ఫ్యాన్స్ ఫైర్..
రీసెంట్ గా ఊర్వశీ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా ఫలితాల గురించి పట్టించుకుంటారా? మీ సినిమాతో పాటు బాలీవుడ్ నటి కియారా అద్వానీ గేమ్ ఛేంజర్ సినిమా కూడా విడుదల అయింది కదా.? అని అడిగారు. ఆమె సమాధానం ఇస్తూ..”ఎక్కువ కలెక్షన్స్ ఇచ్చే ట్యాగ్స్ కూడా ఉండాలి. అది కూడా ఒక మంచి గుర్తింపును ఇస్తుంది. వరల్డ్ వైడ్ మన ఆక్టింగ్ స్కిల్స్ కి అభినందనలు కూడా వస్తున్నాయి. నేను ఎన్నో ట్వీట్స్ కూడా చదివాను. ముఖ్యంగా మా సినిమా డాక్ మహారాజ్ మకర సంక్రాంతి పండుగ రోజున విడుదలై.. అతి తక్కువ సమయంలోనే రూ.100 కోట్లు రాబట్టి ఫస్ట్ అవుట్ సైడ్ నటిగా నాకు ఒక రికార్డు అందించారు. ఊర్వశి సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు. అందులో నా తప్పేమీ లేదు” అంటూ అంది. దీంతో ఊర్వశి వ్యాఖ్యలు వైరల్ అవ్వగా అభిమానులు మాత్రం ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమా ఫలితాల గురించి, నటన గురించి, ఇలా మాట్లాడడం ఏమాత్రం సరికాదని.. గేమ్ ఛేంజర్ కథపరంగా మాత్రమే డిజాస్టర్ అయిన నటన పరంగా అటు కియారా, ఇటు రామ్ చరణ్ భారీ సక్సెస్ అందుకున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
విమర్శలపై క్లారిటీ..
ఇక దబిడి దిబిడి పాటలోని స్టెప్పులపై జరుగుతున్న ట్రోలింగ్ పై కూడా ఆమె స్పందించింది. సక్సెస్ వెంట విమర్శలు కూడా ఉంటాయి. ఈ పాటపై జరుగుతున్న చర్చను నేను అర్థం చేసుకుంటాను. నందమూరి బాలకృష్ణతో చేసిన డాన్స్ విషయానికి వస్తే.. మా పెర్ఫార్మెన్స్ కి పలువురు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో డాన్స్ అంటే కేవలం పర్ఫామెన్స్ మాత్రమే కాదు.. కళపై నాకున్న గౌరవాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడంతో సమానంగా ఫీల్ అవుతాను. ఇదంతా కళలో ఒక భాగం. మేము వేసిన ప్రతి స్టెప్పు కూడా మమ్మల్ని మరింత అందంగా చూపించింది. ఆయనతో పనిచేయడం నాకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది అంటూ ఊర్వశీ తెలిపింది.