Wednesday, April 16, 2025

డైరెక్టర్‌ కాదు… ఓన్లీ కాన్సెప్ట్‌

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న టాలీవుడ్ డైరెక్ట‌ర్‌ పూరి జగన్నాథ్ ఇటీవ‌ల కోలీవుడ్ స్టార్ న‌టుడు విజ‌య్ సేతుప‌తితో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభంకానుంది. అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై హీరో విజ‌య్ సేతుప‌తి స్పందించారు. ఫ్లాప్‌ల‌తో స‌త‌మ‌వుతున్న పూరి జగన్నాథ్‌తో సినిమా ఎలా ఓకే చేశారు అనే ప్ర‌శ్న‌కు సేతుప‌తి బ‌దులిచ్చారు. దర్శకులను తాను వారి గత సినిమాల ఫలితాలతో జడ్జ్‌ చేయన‌ని చెప్పారు. స్క్రిప్ట్‌ నచ్చితేనే సినిమా చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.
పూరి చెప్పిన స్టోరీ త‌న‌కు చాలా బాగా నచ్చింది, అందుకే ఒప్పుకున్న‌ట్లు తెలిపారు. ఇలాంటి కథను ఇప్పటివరకూ తాను చేయ‌లేద‌న్నారు. తాను ఎప్పుడూ కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తానని, గతంలో చేసిన స్టోరీల‌ను పునరావృతం కాకుండా జాగ్రత్తపడతానంటూ వివ‌రించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com