Monday, May 12, 2025

మరోసారి కేసీఆర్ కు నోటీసులు

27వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించిన జస్టీస్ నరసింహారెడ్డి కమిషన్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జస్టీస్ నరసింహారెడ్డి కమిషన్ గట్టి షాక్ నిచ్చింది. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై విచారణ చేపడుతున్న నర్సింహా రెడ్డి లోని పవర్ కమిషన్ మంగళవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆయనను పవర్ కమిషన్ ఆదేశించింది. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సైతం పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది.

నోటీసులు ఈ నెల 19వ తేదీనే ఇవ్వగా తాజాగా ఇది వెలుగులోకి వచ్చింది. కాగా ఇప్పటికే ఒకసారి కేసీఆర్ కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. కమిషన్ నోటీసులకు కేసీఆర్ సైతం ఘాటు రిప్లై ఇచ్చారు. కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని, విచారణ నుండి కమిషన్ చైర్మన్ నర్సింహా రెడ్డి తప్పుకోవాలని కేసీఆర్ సంచలన డిమాండ్ చేశారు.

తాజాగా నర్సింహా రెడ్డి కమిషన్ విచారణపై స్టే విధించాలని కేసీఆర్ హై కోర్టును ఆశ్రయించారు. విచారణను నిలిపివేయాలని కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టకముందే.. పవర్ కమిషన్ మరోసారి గులాబీ బాస్‌కు నోటీసులు జారీ చేయడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కమిషన్ నోటీసులపై ఫస్ట్ టైమ్ ఘాటుగా రియాక్ట్ అయిన గులాబీ.. ఈ సారి ఏ విధంగా రెస్పాండ్ అవుతారోనని ఆసక్తి నెలకొంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com