Sunday, November 17, 2024

‘దేవ‌ర‌’తో హిస్ట‌రీ క్రియేట్ చేసిన ఎన్టీఆర్‌

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘దేవ‌ర‌’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై  మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె నిర్మించిన  ఈ మూవీ సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో బాలీవుడ్ వెర్స‌టైల్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టించారు.

భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ‘దేవ‌ర‌’ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌లైన ఈ చిత్రం తొలి రోజున రూ.172 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. అదే స్పీడుని కొన‌సాగిస్తోంది. ఈ వారాంతం ముగిసే వ‌ర‌కు అంటే మూడు రోజుల్లోనే రూ.304 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించ‌టం విశేషం. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ చూస్తుంటే 80 శాతం రిక‌వ‌రీ అయ్యింది.

తెలుగు రాష్ట్రాల్లో ‘దేవ‌ర‌’ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకెళ్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు రాష్ట్రాల్లో రూ.87.69 షేర్ క‌లెక్ష‌న్స్ సాధించింది. అలాగే హిందీలోనూ చ‌క్క‌టి వ‌సూళ్లు వ‌స్తున్నాయి. నార్త్ బెల్ట్‌లో దేవ‌ర సినిమా క‌లెక్ష‌న్స్ నెమ్మ‌దిగా పెరుగుతూ వ‌స్తున్నాయి. హ్యూజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో ప్రారంభ‌మైన ఈ సినిమా అదే జోరుని కొన‌సాగిస్తోంది. నాలుగో రోజు కూడా థియేట‌ర్స్ అన్నీ హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్స్‌తో కొన‌సాగుతుండ‌టం విశేషం.

‘దేవ‌ర‌’ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌స్తోంది. సోష‌ల్ మీడియాలో సినిమాను అద్భుతమ‌ని ప్ర‌శంసిస్తూ రివ్యూస్ పోస్ట్ చేస్తున్నారు ఆడియ‌న్స్ . స‌ముద్ర తీర నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో మేజ‌ర్ అంశాల‌తో పాటు భ‌యం లేని వారియ‌ర్స్ చుట్టూ చెప్పిన క‌థ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఎన్టీఆర్ హీరోగా న‌టించిన ఈ  చిత్రంలో జాన్వీ క‌పూర్‌, సైఫ్ అలీఖాన్‌ల‌తో పాటు ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, అజ‌య్‌, గెట‌ప్ శీను త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, ఆర్‌.ర‌త్న‌వేలు సినిమాటోగ్రాఫ‌ర్‌గా, సాబు సిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా, అనిరుద్ సంగీత ద‌ర్శ‌కుడిగా వ‌ర్క్ చేశారు. దేవ‌ర సినిమా తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాషల్లోనూ రిలీజ్ అయ్యింది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular