– ఇంత బరువైన పాత్రలో సెట్ అవుతాడా?
– ఎమోషనల్ కథలో ఆయనను ఊహించగలమా?
– నటన ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది
టాలీవుడ్‌లో యాక్షన్, మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు ఓ ఐకానిక్ బయోపిక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నాడని టాక్ వస్తోంది. ఇండియన్ సినిమా జనకుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘మేడ్ ఇన్ ఇండియా’ సినిమాలో ఎన్టీఆర్ నటించనున్నట్లు ముంబై మీడియా వర్గాల సమాచారం. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’, ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. నెక్స్‌ట్ దేవర 2’తో లైన్ లో ఉంది. అలాగే రీసెంట్ గా ఈ బయోపిక్ కోసం ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఎస్.ఎస్. రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయ, మాక్స్ స్టూడియోస్ వరుణ్ గుప్తా సమర్పణలో రూపొందనుందట. ‘మేడ్ ఇన్ ఇండియా’ స్క్రిప్ట్‌ను విన్న ఎన్టీఆర్, దాదాసాహెబ్ ఫాల్కే జీవితంలోని తెలియని కోణాలతో ఆకట్టుకున్నాడని, వెంటనే ఈ పాత్రను చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. దాదాసాహెబ్ ఫాల్కే 1870లో జన్మించి, 1913లో భారతదేశపు తొలి ఫీచర్ ఫిల్మ్ ‘రాజా హరిశ్చంద్ర’ను తెరకెక్కించారు. మొత్తం 95 సినిమాలు చేసిన ఆయన, సినిమా కోసం తన ఆస్తులను అమ్మి, లండన్ నుంచి కెమెరా తెచ్చుకుని, భార్య ఆభరణాలను కూడా అమ్మి సినిమా తీసిన ఆయన కష్టాలు అనేకం. ఈ సినిమా ఆయన జీవితంలోని ఎమోషనల్, డ్రామాటిక్ అంశాలను తెరపైకి తీసుకొస్తుందని అంటున్నారు. ఎన్టీఆర్ ఇప్పటివరకు మాస్, యాక్షన్ సినిమాలతో అలరించిన హీరో. ఇలాంటి బయోపిక్‌లో ఆయన నటన ఎలా ఉంటుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎన్టీఆర్ వంద శాతం ఈ పాత్రకు న్యాయం చేయగలడని అభిమానులు నమ్ముతున్నారు, కానీ ఇప్పటివరకు ఇలాంటి స్లో పేస్, ఎమోషనల్ కథల్లో ఆయనను ఊహించని వారు కూడా ఉన్నారు. అయితే, రాజమౌళి వెనక ఉండటం సినిమా కంటెంట్‌పై నమ్మకాన్ని కలిగిస్తోంది. దర్శకుడు ఎవరనేది కూడా ఈ సినిమా విజయంలో కీలకంగా మారనుంది. దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఎంతో డ్రామాటిక్‌గా సాగింది. 1903లో ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఫొటోగ్రాఫర్‌గా చేరిన ఆయన, 1910లో ‘లైఫ్ ఆఫ్ క్రైస్ట్’ సినిమా చూసి స్ఫూర్తి పొందారు. సినిమా తీసేందుకు ఆయన తన ఆస్తులను అమ్మి, లండన్‌లో కెమెరా కొనుగోలు చేసి, రూ.10,000 సమకూర్చుకున్నారు. ఆయన భార్య సరస్వతి బాయ్ కూడా ఆభరణాలు అమ్మి ఆర్థికంగా సపోర్ట్ చేసింది. ఈ సినిమా ఆయన జీవితంలోని ఈ ఎమోషనల్ అంశాలను తెరపైకి తీసుకొస్తుందని అంటున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే జీవితం చివరి రోజులు విషాదంగా సాగాయి. భారత సినిమాకు జన్మనిచ్చిన ఆయన, చివరి ఆరేళ్లు సొంత ఇల్లు లేక దీనస్థితిలో జీవించారు. అనారోగ్యంతో ఆయన మరణించారు, ఇది సినిమాకు ఎమోషనల్ డెప్త్‌ను జోడిస్తుంది. ఇలాంటి పాత్రలో ఎన్టీఆర్ నటన సినిమాకు కీలకం కానుంది.