Saturday, April 26, 2025

ఎన్టీఆర్‌ తిరస్కరించిన సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్లే

-డేట్లు ఖాళీలెకపోవడమే అసలు కారణమా?
– కథలు నచ్చలేదా
– కామెడీ చేయడం రాక ‘కిక్‌’ వదిలేశారా
జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగానే కాకుండా గ్లోబల్ హీరోగా కూడా పేరు తెచ్చుకున్నారు.. జపాన్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో మల్టీస్టారర్ సినిమాగా వార్2 చేస్తున్నారు. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు. దీనితర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కానుంది. డేట్లు ఖాళీ లేక వద్దనుకున్నారు కెరీర్ మొదటి నుంచి ఇప్పటివరకు తనదగ్గరకు ఎన్నో కథలు రాగా, చాలావరకు తిరస్కరించారు. డేట్లు ఖాళీలేకపోవడం, కొన్ని సినిమాల షూటింగ్స్ లో ఉండటం, కొన్ని కథలు నచ్చకపోవడంలాంటి కారణాలతో వాటిని తిరస్కరించారు. అలా ఆయన వద్దన్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ సినిమాలుగా నిలవడం విశేషం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ నటించిన కిక్, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన ఆర్య, వినాయక్ దర్శకత్వంలో నితిన్ నటించిన దిల్, బోయపాటి మొదటి సినిమా భద్ర, నాగార్జునతో ఊపిరి, కల్యాణ్ రామ్ చేసిన అతనొక్కడే, ఎవడు, కృష్ణ సినిమాలన్నీ ముందుగా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకే వచ్చాయి. కిక్ లో కామెడీ ఎక్కువగా ఉండటంతో వద్దనుకున్నారు. ఆర్య కథ వచ్చిన సమయానికి కొన్ని ప్రేమకథలు చేసివుండటంతో అది కూడా వద్దనుకున్నారు. బోయపాటి తన మొదటి సినిమా భద్ర తారక్ తో చేయాలని ప్రయత్నించినప్పటికీ డేట్లు ఖాళీ లేకపోవడంతో కుదర్లేదు. ఆ సినిమా తారక్ చేసుంటే మరోలా ఉండేది ఇలా పలు సినిమాలను వదులుకోగా అవన్నీ సూపర్ హిట్ సినిమాలయ్యాయి. భద్ర సినిమా తారక్ చేసుంటే మరో లెవల్ లో ఉండేదని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. వార్2, డ్రాగన్ సినిమాలతో పాన్ ఇండియాస్థాయిలోను, అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com