- ‘ఆ మహనీయుడి 101 జయంతి సందర్భంగా ఘన నివాళి
- ట్వీట్ చేసిన సిఎం రేవంత్‌రెడ్డి
‘ఎన్టీఆర్.. తెలుగుజాతి చిహ్నం’. ‘ఆ మహనీయుడి 101 జయంతి సందర్భంగా ఘన నివాళి’ అంటూ సిఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్మరించుకుంటున్నారు.
చిత్ర పరిశ్రమలో ఆయన పోషించిన పాత్రలను, దేశ, తెలుగు రాజకీయాల్లో ఆయన తీసుకొచ్చిన సమూల మార్పులను గుర్తుచేసుకుంటు న్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు పెట్టారు.