Saturday, February 22, 2025

నుమాయిష్‌లో ఇంత మంది అరెస్టా?

ప్రతి సంవత్సరం నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ హడావిడి తెలిసిందే. మరి ఈ సంవత్సరం కూడా జనవరి 3 నుంచి ఫిబ్రవరి17 వరకు నుమాయిష్‌ జరిగింది. ఈ నెల 17తో ఈ ఎగ్జిబిషన్ పూర్తయింది. ఈ ఎగ్జిబిషన్ లో విపరీతమైన రద్దీ కొనసాగగా.. ఈ రద్దీలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన మొత్తం 247 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకతాయిలపై మఫ్టీలో నిఘా పెట్టిన షీ టీమ్స్ సిబ్బంది రహస్యంగా వేధింపుల ఘటనలను రికార్డు చేశారు. మహిళలను అసభ్యంగా తాకుతూ వేధించిన వారిని ఎప్పటికప్పుడు అరెస్టు చేశారు. ఇందులో 37 కేసుల్లో చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వుమెన్ సేఫ్టీ డీసీపీ తెలిపారు. ఇద్దరు నిందితులకు 2 రోజుల జైలు, 33 మందికి రూ.1050 చొప్పున ఫైన్ విధించినట్లు చెప్పారు. మరో 190 మందిని హెచ్చరించి వదిలిపెట్టామన్నారు. మిగతా 20 కేసులపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com