ఇండియాలో అందరినీ ఆకట్టుకుంటో ముందుకుసాగుతోన్న స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్స్‌లో జీ 5 ముందు వరుసలో ఉంది. ఇలాంటి మాధ్యమంలో రీసెంట్‌గా థియేటర్స్‌లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘నునక్కుళి’ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. బాసిల్ జోసెఫ్, గ్రేస్ ఆంటోని ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా స్ట్రీమింగ్ కావటాని కంటే ముందే జీ5 కేరళలో ప్రీ సబ్‌స్క్రిప్షన్స్‌ను సాధించటం విశేషం. ఈ క్రమంలో మనోరథంగల్, పప్పన్, సూపర్ శరణ్య చిత్రాలను ఈ చిత్రం అధిగమించింది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో బాసిల్ జోసెఫ్ ను మరో విలక్షణమైన పాత్రలో చూడటానికి ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నునక్కుళి సినిమా సెప్టెంబర్ 13 నుంచి మలయాళంతో పాటు తెలుగు, కన్నడ ప్రేక్షకుల ముందుకు రానుంది.