మొన్న కోల్ కతా లో వైద్య విధ్యార్ధిపై హత్యాచారం, హత్య ఘటన మరువక ముందే.. ఉత్తరాఖండ్ లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వైపు కోల్ కతా వైద్యురాలి రేప్, హత్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్న సమయంలో ఉత్తరాఖండ్ లో ఓ ప్రైవేట్ హస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న నర్స్ హత్యాచారంతో పాటు హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ఉత్తరాఖండ్ లోని ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతలో జులై 30 న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జులై 30న సాయంత్రం సదరు నర్స్ రుద్రపూర్ లోని ఇంద్రా చౌక్ వద్ద తాను పనిచేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఆటోరిక్షా ఎక్కి ఇంటికి బయలుదేరింది. యూపీ బిలాస్పూర్ లో ఆమె ఉండే కాశీపూర్ రోడ్డుకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆమె ఎంతకీ ఇంటికి చేరుకోలేదు.
సదరు నర్సుకు 11ఏళ్ల కూతురు ఉండగా.. ఇద్దరు కలిసి కాశీపూర్ రోడ్డు ప్రాంతంలో నివాసముంటున్నారు. తన తల్లి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆమె కూతురు ఆందోళనకు గురైంది. మరుసటి రోజు ఆమె కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో నర్సు సోదరి పిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 8 రోజుల తరువాత ఆగస్ట్ 8న నర్స్ మృత దేహం ఆమె నివాసం ఉంటున్న ఇంటికి 1.5 కిలో మీటర్ల దూరంలోని ఓ ఖాళీ స్థాలంలో లభించింది. నర్స్ మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ప్రత్యేకంగా టీమ్ ను ఏర్పాటు చేశారు పోలీసు ఉన్నాతాధికారులు.
ఆ రోజు హాస్పిటల్ నుంచి బయలుదేరినప్పటి నుంచి ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు. అంతే కాకుండా ఆమె ఫోన్ కనిపించడం లేదని గుర్తించి, దానిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నించగా.. అది నిందితుడు ధర్మేంద్ర దగ్గరికి తీసుకెళ్లింది. ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీకి చెందిన ధర్మేంద్ర దినసరి కూలి. మద్యం మత్తులో ఉన్న నిందితుడు ఒంటరిగా ఉన్న నర్స్ ను చూసి ఆమెను ఫాలో అయ్యాడు. తన ఇంట్లోకి వెళ్తుండగా ఆమెపై దాడి చేసి పక్కనే ఉన్న పొదొల్లోకి లాక్కెళ్లి హత్యాచారం చేసి ఆ తరువాత ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. నర్స్ ను చంపిన తరువాత ఆమె మొబైల్ ఫోన్ తో పాటు ఆమె పర్స్ లో నుంచి 3వేలను దొంగలించి.. పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆమె డెడ్ బాడీని పడేశాసి వెళ్లిపోయాడు. ధర్మేంద్ర కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఆ దుర్మార్గుడిని రాజస్థాన్ లో అరెస్ట్ చేశారు. బాధిత మహిళ కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.