ఓదెల2 చివరి షెడ్యూల్ ఓదెల విలేజ్ లో జరుగుతోంది. మహాదేవుని ఆశీస్సులతో కాశీలో ప్రారంభమైన ఈ థ్రిల్లింగ్ సీక్వెల్ ఇప్పుడు ఓదెల మల్లన్న క్షేత్రంలో చిత్రీకరణ జరుగుతోంది. టీం ఐకానిక్ ఓదెల మల్లన్న ఆలయం, గ్రామంలోని అందమైన ప్రదేశాలలో కీలక సన్నివేశాలను షూట్ చేస్తోంది. తమన్నా, మురళీ శర్మ, హెబ్బా పటేల్, యువ, ఇతర నటీనటులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. తమన్నా మొదటి సారి ఓదెల విలేజ్ లో షూటింగ్ చేస్తున్నారు. ఈ చివరి షెడ్యూల్‌ను రూపొందించడానికి సహకరించిన ఓదెల గ్రామస్తులకు మేకర్స్ కృతజ్ఞతలు తెలిపారు.
సంపత్ నంది సూపర్ విజన్ లో ఓదెల 2 ఎమోషనల్ డెప్త్, అడ్రినలిన్-పంపింగ్ యాక్షన్‌తో నిండిన గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్‌రాజన్ డీవోపీ కాగా రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్.