Monday, July 1, 2024

హైదరాబాద్‌లో ‘ఓదెల 2’ కీలకమైన యాక్షన్ షెడ్యూల్

తమన్నా భాటియా, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌తో కలిసి స్టైలిష్ మాస్ డైరెక్టర్ సంపత్ నంది క్రియేట్ చేసిన 2021 హిట్ ‘ఒదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ అయిన ‘ఒదెల-2 కోసం’ కోసం చేతులు కలిపారు. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, షెడ్యూల్డ్ వర్కింగ్ వీడియోకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది, సీక్వెల్‌పై ఎక్సయిట్మెంట్ ని పెంచింది. హై-బడ్జెట్, మల్టీ లాంగ్వేజ్ మూవీ ఇప్పుడు హైదరాబాద్‌లో కీలకమైన యాక్షన్ షెడ్యూల్ ని ప్రారంభించింది.

సినిమాలోని కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. టాప్ క్లాస్ యాక్షన్ డైరెక్టర్స్ తో కొరియోగ్రఫీ చేస్తున్న ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా వుంటాయి. ఇన్నోవేటీవ్ స్టంట్స్ , బ్రీత్ టేకింగ్ సినిమాటోగ్రఫీ ఆడియన్స్ గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించనున్నాయి. ఈ సన్నివేశాలు పెర్ఫెక్షన్, రియలిజంతో అద్భుతంగా చిత్రీకరించడానికి టీం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఈ యాక్షన్-ప్యాక్డ్ మూమెంట్స్‌కి ప్రాణం పోసేందుకు ఎక్స్ పర్ట్ స్టంట్ కోఆర్డినేషన్ టీం పని చేస్తోంది. ఆడియన్స్ కు సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమా కోసం తమన్నా భాటియా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular