Wednesday, November 20, 2024

ఎల్ అండ్ టి బంపర్ ఆఫర్…

  • మెట్రో స్టేషన్‌లలోనూ ఆఫీసుల ఏర్పాటుకు ‘ఆఫీస్ బబుల్స్’
  • పట్టణ రవాణా రంగంలో వినూత్న ప్రయోగం చేసిన మెట్రో అధికారులు

ఆఫీస్ స్పేస్ కోసం వెతుకుతున్నారా ఎల్ అండ్ టి సంస్థ బంపర్ ఆఫర్ ఇస్తోంది. నగరంలో మూడు ప్రధాన మెట్రో స్టేషన్లలో సురక్షితమైన రిమోట్ కో వర్కింగ్ స్పేస్ కోసం ఆఫీస్ బబుల్స్‌ను ప్రారంభించింది. ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్‌ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను గుర్తించిన ఆఫీస్ బబుల్స్ ను ఓపెన్ చేసినట్లు ఎల్ అండ్ టి పేర్కొంది. ఇది పట్టణ రవాణా రంగంలో మొట్ట మొదటి వినూత్న ప్రయోగంగా మెట్రో తెలిపింది. ఈ ఆఫీస్ బబుల్స్ ద్వారా ఎల్ అండ్ టి సంస్థ హైదరాబాద్ లోని మెట్రో స్టేషనలలో కావాల్సిన స్పేస్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ స్థలంలో ఎటువంటి ఆఫీసులైన పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఐటీ ఆఫీసుల వంటి కమర్షియల్ ఆఫీసులను సైతం ఏర్పాటు చేసుకోవచ్చు.

మొదటగా ఆఫీస్ స్పేస్ ఆపరేటర్ చేసిన ‘ట్రెండ్జ్ వర్క్ స్పేస్ ’ A ‘trendy work space’ by an office space operator
ప్రస్తుతం హైటెక్ సిటీ, దుర్గం చెరువు, మాదాపూర్ వంటి మెట్రో ప్రధాన స్టేషన్‌లలో ఈ ఆఫీస్ బబుల్స్ ను మెట్రో అధికారులు ఏర్పాటు చేశారు. 10వేల చదరపు అడుగుల స్థలాన్ని ఎల్ అండ్ టి సంస్థ లీజుకు ఇస్తోంది. ఎల్ అండ్ టి సంస్థ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త విధానం రిమోట్ ఆఫీసులను ఏర్పాటు చేసుకునేందుకు మంచి అవకాశాన్ని అందిస్తుంది. నిరంతరాయమైన కనెక్టివిటీ కోసం హైదరాబాద్ మెట్రోనెట్ వర్క్ ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ఆఫర్‌ను ఉపయోగించుకున్న మొదటి కమర్షియల్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్ ‘ట్రెండ్జ్ వర్క్ స్పేస్ ’ అని సంస్థ ప్రకటించింది.

బిజినెస్ పరంగా అనుకూలమైన Modern Efficient Work Environment మోడర్న్ ఎఫిషియెంట్ వర్క్ ఎన్వీరాన్ మెంట్ ను కోరుకునే స్థలంకోసం నిరంతరాయమైన కనెక్టివిటీని ఈ ఆఫీస్ బబుల్స్ ఆఫర్ చేస్తోందని ఎల్ అండ్ టి సంస్థ తెలిపింది. రెండు యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా ఆఫీస్ బబుల్స్ క్లెయింట్స్ కోరుకున్న విధంగా అనేక రకాల సైజుల్లో, రెండు యూనిట్లను ఏర్పాటు చేసుకునేలా 1,750 చదరపు అడుగుల స్థలాన్ని పొందవచ్చని మెట్రో అధికారులు తెలిపారు. ఇది హైదరాబాద్ లోని మొత్తం 49 టిపికల్ మెట్రో స్టేషన్‌లలో అందుబాటులో ఉంది. అంతేకాదు పెద్ద స్థలాలు కూడా లీజుకు తీసుకోవచ్చు. 8 నాన్ టిపికల్ మెట్రో స్టేషన్లలో 5వేల చదరపు అడుగుల నుంచి 30 వేల చదరపు అడుగుల వరకు లీజుకు తీసుకోవచ్చు. ఎక్కువ రద్దీ ఉంటే మెట్రోస్టేషన్‌లలోనూ ఈ ఆఫీస్ బబుల్స్ ను ఏర్పాటు చేసుకోవచ్చని మెట్రో తెలిపింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular