ఒక్కోసారి ప్రభుత్వ ఉద్యోగులు అత్యుత్సాహం చూపిస్తుంటారు. అలా అత్యుత్సాహం చూపించి చిక్కుల్లో చిక్కుకున్న ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. సాధారమంగా ప్రభుత్వ ఉద్యోగులు పార్టీలకు అతీతంగా, మరీ ముఖ్యంగా విధుల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. ఐతే ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ మాత్రం విధి నిర్వహణను పక్కన పెట్టి చేసిన పని ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం గుంటూరు జిల్లా జైలుకు వెళ్లి మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్‌రెడ్డిని పరామర్శించి బయటికి వచ్చారు.
అదే జైలులో విధులు నిర్వహిస్తున్న అనంతపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్ ఆయేషాబాను జగన్ అభిమాని అట. ఇంకేముంది జగన్ ను చూసిన ఆనందంలో ఆయనతో సెళ్పీ దిగింది. జగన్ మీడియాతో మాట్లాడుతుండగా.. అందరి మధ్యలోకి దూసుకొచ్చి కుమార్తెతో కలిసి జగన్ తో సెల్ఫీలు దిగింది ఆయోషా బాను. జగన్ సైతం వారితో చిరున్వుతో మాట్లాడి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇలా జగన్ తో సెఫ్లీ దిగడం పట్ల పోలీసులు ఉన్నతాధికారులు కానిస్టేబుల్ ఆయోషాబానుపై గుర్రుగా ఉన్నారని సమాచారం.