పెళ్లి చేసుకునేందుకు కొందరు యువకులకు అమ్మాయిలే దొరకని రోజులివి. కానీ, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ యువకుడు.. ఒకే కల్యాణ వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరితో కలిసి ఏడడుగులూ నడిచాడు. ఈ పెళ్లి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం అడ్డెసర గ్రామానికి చెందిన రంభ బాయ్, బద్రుషావ్ దంపతుల కుమారుడు ఛత్రుషవ్. అదే గ్రామానికి చెందిన పూనగూడకు చెందిన జంగుబాయి, అదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన సోమ్‌దేవిలను వివాహమాడాడు. ఇరువురు అమ్మాయిల కుటుంబాల సమ్మతితో వైభవంగా ఆదివాసీల సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు.