Wednesday, November 6, 2024

వొచ్చే నెల 6 నుంచి స‌మ‌గ్ర‌ కుల గణన స‌ర్వే..

55 కి.మీ మూసీ పునరుజ్జీవం పూర్తయితే అద్భుతనగరం ఆవిష్కృత‌మవుతుంది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మూసీ పరీవాహకంలో సమయం వొచ్చినప్పుడు పాద‌యాత్ర చేస్తా. అవసరమైతే వాడపల్లి నుంచి వికారాబాద్‌ ‌వరకు పాదయాత్ర చేస్తా.. మూసీపై ముందడుగే.. వెనకడుగు వేసేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్ణయం తీసుకునే ముందే వెయ్యిసార్లు ఆలోచిస్తామని అన్నారు. నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేదే లేదని తేల్చిచెప్పారు. నవంబర్‌ 1‌న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనులు మొదలుపెడుతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తొలుత బాపూఘాట్‌ ‌నుంచి పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు.

నవంబరులో ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చలకు సిద్ధమన్నారు. త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. బీఆర్‌ఎస్‌ ‌నేతలు మూసీ పునరుజ్జీవంపై అభ్యంతరాలను తెలియజేయాలి. నన్ను కలవడానికి ఇబ్బంది అయితే మంత్రులు, అధికారులను కలిసి చెప్పొచ్చు. బాపూఘాట్‌ ‌నుంచి వెనక్కి 21 కి. అభివృద్ధి చేస్తాం. మల్లన్న సాగర్‌ ‌నుంచి మూసీకి నీరు తరలిస్తాం. మల్లన్నసాగర్‌ ‌నుంచి గోదావరి నీటి తరలింపునకు నవంబరులో టెండర్లు పిలుస్తాం. మూసీ అభివృద్ధి అధ్యయనానికి నగర ప్రజాప్రతినిధులను పంపుతాం. నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను సియోల్‌కు పంపుతాం. మూసీ పునరుజ్జీవంపై కావాలనే చర్చకు తెరలేపాను.

ఈ చర్చ కారణంగా ప్రజలకు అవగాహన కలిగింది. మూసీని బాగు చేసేవాడొకడు వొచ్చాడని ప్రజలకు తెలిసింది. ఈ ప్రాజెక్టు ద్వారా పర్యాటకం అభివృద్ధి చెందుతుందని సిఎం రేవంత్‌ ‌వివరించారు. మూసీ కోసం భూములిచ్చేవారికి వందశాతం సంతృప్తి చెందేలా ప్యాకేజీ ఇస్తాం. ప్రజలను కష్టపెట్టి భూములు తీసుకోబోం.. బాపూఘాట్‌ ‌దగ్గర బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మిస్తామని తెలిపారు. బాపూఘాట్ వ‌ద్ద‌ ‌అభివృద్ధి కోసం ఆర్మీ స్థలం అడిగామని చెప్పారు.15 రోజుల్లో ఎస్టీపీలకు టెండర్లు వేస్తామని తెలిపారు. మూసీ వెంట అంతర్జాతీయ వర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్‌..‌రీక్రియేషన్‌ ‌సెంటర్‌, ‌నేచర్‌ ‌క్యూర్‌ ‌సెంటర్‌ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మల్లన్న సాగర్‌ ‌నుంచి గోదావరి జలాలను తెచ్చి గండిపేటలో పోస్తామని తెలిపారు.

దీనికి సంబంధించి ట్రంక్‌ ‌లైన్‌ ‌కోసం నవంబర్‌ ‌మొదటి వారంలో టెండర్లు పిలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టును ఎన్జీవోలు వ్యతిరేకిస్తే అర్థం ఉంది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎం‌దుకు వ్యతిరేకిస్తుందో అర్థం కావట్లేదు. కేటీఆర్‌ ‌ప్రపంచస్థాయి మేధావిని అనుకుంటారు. మూసీని బాగు చేసే అంశంలో కేటీఆర్‌ ‌తన ఆలోచనలు చెప్పొచ్చు. అంతర్జాతీయ అవగాహన ఉన్న ఆయనకు మూసీని ఎలా బాగు చేయాలో తెలియదా? ఈ ప్రాజెక్టుపై కేటీఆర్‌ ‌నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నా. కేటీఆర్‌, ‌హరీష్‌రావు, ఈటల తమ ప్రతిపాదనలు తెలపాలి. నేను ఫుట్‌బాల్‌ ‌ప్లేయర్‌ని.. గేమ్‌ ‌ప్లాన్‌పై నాకు స్పష్టత ఉంది. 55 కి.మీ మూసీ పునరుజ్జీవం పూర్తయితే అద్భుతనగరం ఆవిష్కృత‌మవుతుందని వివరించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular