కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీట ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని సిఎం అధికారులకు సూచించారు.
అలాగే కొడంగల్ చేపల మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సిఎం ఆదేశాలు జారీ చేశారు. మద్దూరు రెసిడెన్షియల్ క్యాంపస్ నిర్మాణంపై సిఎం పలు సూచనలు చేశారు. ఇక నుంచి కొడంగల్ లిప్ట్ ఇరిగేషన్ పనులపై ప్రతి నాలుగు వారాలకోసారి సిఎం సమీక్ష చేయనున్నారు.