Monday, March 10, 2025

హైదరాబాద్- టు విజయవాడ జాతీయ రహదారిపై పెరిగిన టోల్‌చార్జీలు

నేటి నుంచి అమల్లోకి…
హైదరాబాద్- టు విజయవాడ జాతీయ రహదారి నెం.65పై టోల్‌చార్జీలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. టోల్ గేట్ల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ రుసుమును పెంచాలని కాంట్రాక్ట్ సంస్థ జిఎంఆర్ నిర్ణయించింది. ఒక్కో వాహనానికి రూ. 5 నుంచి రూ. 40 వరకు ఫీజును, స్థానికుల నెలవారీ పాసుకు రూ.330ల నుంచి రూ.340లకు పెంచినట్టు జిఎంఆర్ తెలిపింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఆంథోల్ మైసమ్మ దేవాలయం నుంచి ఎపిలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వరకు 181.5 కిలోమీటర్ల పొడవునా రెండు వరుసల రహదారిని రూ.2,000 వేల కోట్లతో 2012లో జిఎంఆర్ సంస్థ నాలుగు లేన్లుగా విస్తరించింది. ఈ విస్తరణ పనులకు అయ్యే ఖర్చును రికవరీ చేసేందుకు గాను జిఎంఆర్ ఏపిలోని కృష్ణాజిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, చిల్లకల్లు వద్ద ఒక్కొక్కటి చొప్పున 65వ నెంబర్ జాతీయ రహదారిపై మూడు టోల్ ప్లాజాలను ఏర్పాటు చేసింది. 2012 నుంచి కాంట్రాక్ట్ కంపెనీ వీటి ద్వారా టోల్ ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది.

ఎన్‌హెచ్‌ఏఐ నిర్దేశించిన నిబంధనల ప్రకారం వార్షిక సవరణల పేరుతో సంవత్సరానికి ఒకసారి వాహనాల నుంచి వసూలు చేసే టోల్ ఫీజు ధరలను పెంచడానికి జిఎంఆర్ సంస్థకు ఎన్‌హెచ్‌ఏఐ వెసులుబాటు కల్పించింది. పెరిగిన టోల్ ధరలు సంబంధిత టోల్ ప్లాజాల వద్ద 31వ తేదీ (ఆదివారం) అర్ధరాత్రి 12 గంటల తర్వాత అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని, ఈ ధరలు ఏడాదిపాటు చెల్లుబాటవుతాయని జిఎంఆర్ తెలిపింది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com