-
కేంద్రంలో మరోసారి బీజేపీదే అధికారం
-
తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తాం
-
బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీని ఆదరించారని,అత్యధిక ఎంపీ స్థానాలను గెలవబోతున్నామని చెప్పారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు.. దేశం కోసం, ధర్మం కోసం, మరోసారి మోడీ ప్రధాని కావడం కోసం ఇన్ని రోజులపాటు ఎంతో శ్రమించి పనిచేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలుతున్నాని అన్నారు. పోలింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి మాటల్లో మార్పు కనిపించిందన్నారు. పోలింగ్ కు ముందు 14 సీట్లు గెలుస్తామని చెప్పిన వారే ఇప్పుడు 9 సీట్లు గెలుస్తామని అంటున్నారని అన్నారు.