Thursday, December 26, 2024

నాకు ఒక ఛాన్స్‌ ప్లీజ్‌

హీరో ఆకాష్‌ పూరి గురించి తెలియని వారుండరు. ఆయన రెండు మూడు చిత్రాల్లో నటించారు. మహబూబ, చోర్‌బజార్‌ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ అవి ఆశించినంత ఫలితాలను ఇవ్వలేదు. ఎంత పెద్ద దర్శకుడి కొడుకైనప్పటికీ ట్యాలెంట్‌ ఉన్నా టైమ్‌ కలిసిరావాలి అని అంటుంటారు. అది పూరీ ఆకాష్‌ విషయంలో అక్షరాల నిజమనిపించింది. తన తండ్రే పెద్ద దర్శకుడైనప్పటికీ తనకు మాత్రం మంచి చిత్రాల్లో అవకాశాలు రావడం లేదు. ఇకపోతే ఇటీవలె కొన్ని సినిమాల ఓపెనింగ్స్‌, ప్రీరిలాజ్‌ ఈవెంట్‌లకు గెస్ట్‌గా వెళుతున్నారు. ఇటీవలె చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంచన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా గ్యాంగ్ స్టర్. ఈ చిత్రంలో అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్య నారాయణ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ లో రవి, నరసింహా సమర్పణలో చంద్రశేఖర్ రాథోడ్ దర్శకత్వం వహిస్తున్న గ్యాంగ్ స్టర్ సినిమా ఈ నెల 25న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యంగ్ హీరో ఆకాష్ పూరి అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ – గ్యాంగ్ స్టర్ సినిమా ట్రైలర్, ఇతర కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రేక్షకులు తప్పకుండా ఈ మూవీకి కనెక్ట్ అవుతారు. టెక్నికల్ గా క్వాలిటీగా మూవీ చేశారు. చంద్రశేఖర్ కథ రెడీ చేసుకుంటే నేను ఆయనతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఫైట్స్, కొరియోగ్రఫీ, ఎడిటింగ్, రచన, నిర్మాత దర్శకత్వం..ఇవన్నీ ఒక్కరే చేయడం ఈజీ కాదు. చంద్రశేఖర్ రాథోడ్ అమేజింగ్ వర్క్ చేశారు. రేపు గ్యాంగ్ స్టర్ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు. అతిధిగా వచ్చి అక్కడ దర్శకుడితో ఆయన కథ రెడీ చేసుకుంటే నేను చేయడానికి అభ్యతరం లేదని నిరభ్యంతరంగా ఈ యంగ్‌ హీరో తెలపడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com