యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూర్ ప్రీమియర్ ఎక్ ప్లోజీవ్స్ కంపెనీలో జరిగిన పేలుడు సంఘటనలో ఒక కార్మికుడు మృతిచెందగా, మరొక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. జనగాం జిల్లా బచ్చన్నపేటకు చెందిన కనకయ్య మృతిచెందగా, యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన మొగిలిపాక ప్రకాష్ కు గాయాలయ్యాయి. ప్రకాష్ కు భువనగిరి ఏరియా హాస్పిటల్ లో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ లో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మరి కొంత మంది కార్మికులు కూడా గాయపడగా వారిని కూడా హైదరాబాదులోని ప్రైవేట్ హాస్పటల్ కు తరలించినట్లు తెలుస్తుంది.