Saturday, April 5, 2025

నవ్విస్తూ, భయపెట్టిన ఓ మంచి ఘోస్ట్

హారర్, కామెడీ మిక్స్ చేసి తీస్తోన్న సినిమాలకు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం హారర్, కామెడీ జానర్లలో వచ్చే చిత్రాలకు ఇటు ఓటీటీ, అటు థియేటర్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు అదే ఫార్ములాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మూవీ. హార్రర్ సన్నివేశాలకు హాస్యం జోడించి నేటితరం ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సరికొత్తగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై హాస్యభరితమైన హార్రర్ సినిమాగా ఓ మంచి ఘోస్ట్ రానుంది. ఈ చిత్రంలో ప్రముఖ కమీడియన్ వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, హాస్యనటుడు రఘుబాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. డా.అబినికా ఇనాబతుని నిర్మాణ బాధ్యతలు చేపట్టగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన గ్లింప్స్, లిరికల్ సాంగ్ ఇలా ప్రతీ ఒక్కటీ ప్రేక్షకుల్లో బజ్‌ను క్రియేట్ చేశాయి.

ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్ అయితే అందరినీ నవ్విస్తోంది. భయపెట్టేస్తోంది. ‘పూర్వ జన్మ జ్ఞానంతో మళ్లీ జన్మ ఎత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు.. దెయ్యాలకు మాత్రమే ఉంటుంది’ అనే డైలాగ్‌తో టీజర్ ఓపెన్ అయింది. ‘ఒసేయ్ నువ్వు అరుంధతికి అక్కవైనా.. చంద్రముఖి చెల్లివైనా.. కాశ్మోరా లవర్‌వైనా, కాంచన కజిన్‌వైనా’ అంటూ వెన్నెల కిషోర్ చేసే కామెడీ.. ‘నేను మోహిని పిశాచి మోహం తీర్చా..కామిని పిశాచి కామం తీర్చా.. శంకిని పిశాచి సంక నాకా.. సంక నాకించా’ అంటూ షకలక శంకర్ చేసే కామెడీ ఈ టీజర్‌కే హైలెట్‌గా నిలిచేలా ఉంది. ఇక ఘోస్ట్‌గా నందితా శ్వేతా అందరినీ భయపెట్టేలా ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com