Saturday, May 10, 2025

ఆపరేషన్‌ సింధూర్‌లో హతమైన ఉగ్రవాదులు మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టుల జాబితా విడుదల

జమ్మూ-కశ్మీర్ అందాల్ని ఆస్వాదిద్దామని వెళ్లిన అమాయక టూరిస్టులపై ఏప్రిల్ 22న దాడులకు తెగబడ్డారు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు. 26 మంది పర్యాటకులను కిరాతకంగా చంపేశారు. దీంతో పగతో రగిలిపోయిన భారత్.. మే 7న ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోని లష్కరే తొయిబా, జైషే మహ్మద్ లాంటి 9 ఉగ్రసంస్థల స్థావరాలపై దాడి చేసి దాదాపు 100 మంది టెర్రరిస్టులను హతమార్చింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల పేర్లు తాజాగా బయటకు వచ్చాయి. లిస్ట్‌లో మౌలానా మసూద్ అజార్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు. మరోవైపు, సరిహద్దుల్లో రెచ్చగొడుతున్న పాకిస్థాన్‌పై భారత బలగాలు ఎదురుదాడులకు దిగుతున్నాయి. పాక్ మిలటరీ పోస్ట్‌లు, ఎయిర్‌బేస్‌లు ధ్వంసం చేస్తూ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

లేపేసింది వీళ్లనే

– ముదస్సర్ ఖాదియాన్ ఖాస్ అలియాస్ అబూ జుందాల్: లష్కరే తోయిబాతో ముదస్సర్‌కు అనుబంధం ఉంది. ఇతని అంత్యక్రియల ప్రార్థన ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. దీనికి జేయూడీ (ప్రకటించబడిన గ్లోబల్ టెర్రరిస్ట్)కు చెందిన హఫీజ్ అబ్దుల్ రవూఫ్ నాయకత్వం వహించాడు. పాక్ ఆర్మీలో పనిచేస్తున్న లెఫ్టినెంట్ జనరల్, పంజాబ్ పోలీస్ ఐజీ కూడా ఈ ప్రార్థన కార్యక్రమానికి హాజరయ్యారు.
– హఫీజ్ ముహమ్మద్ జమీల్: ఇతడికి జైష్-ఏ-మొహమ్మద్‌తో అనుబంధం ఉంది. ఇతను మౌలానా మసూద్ అజార్ పెద్ద బావమరిది.
– మొహమ్మద్ యూసుఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్ జీ: మొహమ్మద్ సలీమ్, ఘోసి సహబ్ అని కూడా ఇతడ్ని పిలుస్తుంటారు. అజార్‌కు జైష్-ఏ-మొహమ్మద్‌తో అనుబంధం ఉంది. ఇతను మసూద్ అజార్‌కు బావమరిది. IC-814 హైజాకింగ్ కేసులో ఇతను వాంటెడ్‌.
-ఖలీద్ అలియాస్ అబూ ఆకాషా: ఖలీద్‌కు లష్కరే తోయిబాతో అనుబంధం ఉంది. ఇతను జమ్మూ అండ్ కశ్మీర్‌లో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడ్డాడు. ఆఫ్ఘానిస్తాన్ నుంచి ఆయుధాల అక్రమ రవాణాలో నిమగ్నమై ఉన్నాడు. అతని అంత్యక్రియలు ఫైసలాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ సీనియర్ ఆర్మీ అధికారులు, ఫైసలాబాద్ డిప్యూటీ కమిషనర్ హాజరయ్యారు.
-మొహమ్మద్ హసన్ ఖాన్: జైష్-ఎ-మొహమ్మద్‌తో హసన్ అనుబంధం కలిగి ఉన్నాడు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఆపరేషనల్ కమాండర్ ముఫ్తీ అస్గర్ ఖాన్ కశ్మీరీ కుమారుడే ఇతడు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులను సమన్వయం చేయడంలో ఇతడిది కీలకపాత్ర.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com