[2:47 PM, 5/8/2025] Sampath Sir: ఈ విషయంపై ఖజువాలా సీఐ అమర్జీత్ చావ్లా వివరాలు వెల్లడించారు. ఇసుక దిబ్బల్లో బాంబు లాంటి వస్తువులు చెల్లాచెదురుగా ఉన్న ముక్కలు కనిపించాయని తెలిపారు. ఘటనాస్థలికి చూట్టూ కిలోమీటరు పరిధిలో ముక్కలు పడిఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా ఇసుకలో రెండు లోతై గుంతలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.
‘గ్రామస్థులు జాగ్రత్తగా ఉండండి’
బాంబు లాంటి వంటి వస్తువులు తమ గ్రామ సీపంలో ఉండటం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులు, స్థానిక అధికారులు వారిని జాగ్రత్తా ఉండాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పద వస్తువు చూసినా, వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. రాజస్థాన్లోనే కాకుండా పంజాబ్, జమ్ముకశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో క్షిపణి/బాంబు శకలాల వంటి వస్తువలు కనిపించాయి. పంజాబ్లోని జెతువాల్, మఖాన్ విండి, పంధేర్ గ్రామాల్లో ఈ శకలాలను స్థానికులు గుర్తించారు. దీంతో స్థానికంగా ప్రజలు ప్రజాందోళనలకు గురయ్యారు. ఇక అమృత్ జిల్లాలోని ఓ సరిహద్దు గ్రామంలో కూడా ప్రొజెక్టైల్ శకలం ఆందోళనకు గురిచేసింది. జమ్ముకశ్మీర్లో బార్డర్ విలేజ్లో కూడా ఓ బాంబు శకలం కలకలం రేపింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత సైన్యం చేపట్టిన మెరుపు దాడుల దెబ్బకు పాకిస్థాన్ విలవిల్లాడింది. పాక్, ఏఓకేలోని ఉగ్రకోటలు మట్టిదిబ్బలుగా మారాయి. జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రముఠాల స్థావరాలు ధ్వంసం అయ్యాయి. అందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటికొచ్చాయి.