Thursday, May 8, 2025

Operation Sindhur ఆపరేషన్ సింధూర్.. 100 మందికి పైగా ఉగ్రవాదులు ఖతం..

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది. నేడు తెల్లవారుజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. పహల్గామ్ ఊచకోతకు ప్రతీకారంగా భారతదేశం జరిపిన దాడుల్లో పాకిస్తాన్‌లోని బహల్పూర్‌లో 100 మందికి పైగా జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది.

 

అధికారుల ప్రకారం, భారతదేశం లక్ష్యంగా చేసుకున్న తొమ్మిది ప్రదేశాలు బహవల్‌పూర్‌లోని జెఎం ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) రెండూ పాకిస్తాన్ పంజాబ్‌లోనివే. తెల్లవారుజామున 1:44 గంటలకు ‘ఆపరేషన్ సింధూర్’లో భాగంగా సైనిక దాడులు నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

 

కాగా, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలపై భారత్ సైన్యం విరుచుకుపడింది. భారత్ జరిపిన దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలువురు తీవ్రంగా కూడా గాయపడ్డారని సమాచారం. అయితే, భారత్ ప్రతికారంపై దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగిందంటూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com