Friday, December 27, 2024

ప్రతిపక్షాల దాడులకు… కాంగ్రెస్ ప్రతిదాడులు….

పార్టీకి నష్టం కలిగించే ఆరోపణలపై ధీటుగా సమాధానం చెప్పేలా
కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సిద్ధం
120 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలా ప్రణాళికలు

లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు పార్టీకి నష్టం కలిగిస్తాయని కాంగ్రెస్ అంచనా వేసింది. ప్రతిపక్షాల విమర్శలకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని రాష్ట్ర నాయకత్వం గుర్తించింది. ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వంపై మచ్చ పడడంతో పాటు పార్టీకి కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఎన్నికల్లో కూడా ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపక్షాల ఆరోపణలకు ధీటుగా స్పందించడానికి సిద్ధమయ్యారు. గడిచిన 120 రోజుల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూనే ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం చెప్పేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమయ్యింది.

టిపిసిసి సూచనలతో ముందుకు….
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 120 రోజులైనా ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని, రైతు రుణమాఫీ, రైతుబంధు ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వలేదని, ఇలా వివిధ విమర్శలు చేస్తున్న బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్, మాజీ మంత్రులు కెటిఆర్, హరీష్‌రావులతో పాటు పలువురు బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు బిజెపి కూడా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకొని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తుందని బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తుందే తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని బిజెపి నాయకులు తమ ప్రచారంలో అస్త్రంగా వాడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాల విమర్శలపై స్పందించే నాయకులు తగ్గారు. మంత్రులు, సీనియర్ నాయకులు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదు. దీంతో టిపిసిసి ఎక్కడా తగ్గకుండా ఆయా పార్టీల విమర్శలను తిప్పికొట్టాలని సూచించడంతో ఆ దిశగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ముందుకెళుతున్నారు. తాజాగా ప్రతిపక్షాల విమర్శల దాడులతో వారికి గట్టి సమాధానం చెప్పేందుకు మంత్రులను ప్రభుత్వ విప్‌లను, సీనియర్ నాయకులను రంగంలోకి దించాలని టిపిసిసి నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే బిఆర్‌ఎస్, బిజెపి నాయకుల విమర్శలు చేసిన గంట, రెండు గంటల్లోనే పూర్తిస్థాయిలో ప్రతి విమర్శలు చేసేందుకు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేసుకునేందుకు యంత్రాంగాన్ని కాంగ్రె
స్ పార్టీ సిద్ధం చేసుకుంది.

ఓటర్లను ప్రభావితం చేసేలా….
బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణకాంగ్రెస్ నష్టనివారణ చర్యలకు పూనుకుంది. బిజెపి రాష్ట్రానికి చేసిందేమీ లేదని గణాంకాలతో ఎదురుదాడి చేస్తూ, బిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో చోటు చేటుచేసుకున్న అవినీతి, అక్రమాలను ఎత్తిచూపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అధిక స్థానాలు కైవసం చేసుకోవాలన్న వ్యూహాంతో ముందుకు వెళుతోంది. ఇప్పటికే 14 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ప్రచారంపై దృష్టి సారించింది. గడిచిన నాలుగు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధితో పాటు జాతీయ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు, అయిదు గ్యారంటీలను ఇంటింటికి తీసుకెళ్లడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలని భావిస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com