Tuesday, December 24, 2024

ORR Accident: హైదరాబాద్ ఔటర్ పై ఘోర ప్రమాదం

రింగ్ రోడ్డుపై బోల్తా పడ్డ ట్రావెల్స్ బస్సు

నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్ రింగు రోడ్డుపై అతివేగంతో వచ్చిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు చక్రాల కింద పడి ఇద్దరు ప్రయాణికులు చనిపోయారు. అతి వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా స్కిడ్ అయ్యి బోల్తాకొట్టటంతో కిటీల్లోకి ఎగిరిపడి అదే బస్సు టైర్ల కింద నలిగి ఇద్దరు ప్రయాణికులు మృతి చెందినట్టు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో మరో 15 మంది ప్రయాణికులకు గాయాలవ్వగా.. వారిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందుస్తున్నారు. ఆదివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో బస్సు ప్రమాదం జరగడంతో ఔటర్ రింగు రోడ్డుపై సుమారు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మార్నింగ్‌ స్టార్‌ ట్రావెల్స్ కు చెందిన బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీదుగా ముంబయికి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

నార్సింగి వద్దకు రాగానే వర్షం కారణంగా స్కిడ్ అయినట్లు ప్రత్యక్ష్య సాక్షులు చెబుతున్నారు. బస్సు ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులను వెలికి తీశారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. క్రేన్‌ సహాయంతో రోడ్డుపై నుంచి బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com