Tuesday, April 1, 2025

తెలుగులో ప్రమాణం చేసిన మన ఎంపీలు

  • పంచెకట్టులో ఆకర్షించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ అప్పలనాయుడు
  • హిందీలో ప్రమాణం చేసిన అరకు ఎంపీ తనుజా రాణి

లోక్ సభలో ఎంపీలుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం లోక్ సభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎంపీలలో 280 మంది సభ్యుల చేత ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణస్వీకారం చేశారు. ముందుగా ప్రధాని మోడీ ప్రమాణం చేయగా, ఆ తర్వాత కేంద్రమంత్రులు ఒక్కొక్కరుగా ప్రమాణం చేశారు.

ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి (బీజేపీ) , బండి సంజయ్ కుమార్ (బీజేపీ), రామ్మోహన్ నాయుడు (టీడీపీ), పెమ్మసాని చంద్రశేఖర్( టీడీపీ), బూపతిరాజు శ్రీనివాస్ వర్మ (బీజేపీ)లు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.

పంచెకట్టుతో తెలుగుతనం ఉట్టిపడేలా కిషన్ రెడ్డి, ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ అప్పలనాయుడు కలిశెట్టి పార్లమెంట్ లోకి ప్రవేశించి అందరిని ఆకర్షించడం గమనార్హం. అలాగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అప్పలనాయుడు కలిశెట్టి తమ టీడీపీ పార్టీ గుర్తు సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంట్ కు రావడం విశేషం. ఇదిలావుండగా ఎంపీలు దగ్గుబాటి పురంధేశ్వరి, వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్ (చిన్ని) , లావు శ్రీకృష్ణ దేవరాయులు, మతుకుమిల్లి శ్రీభరత్, అప్పలనాయుడు కలిశెట్టి తెలుగులోనే ప్రమాణస్వీకారం చేశారు. అరకు ఎంపీ తనుజా రాణి మాత్రం హిందీలో ప్రమాణస్వీకారం చేశారు. మరికొంతమంది తెలుగు ఎంపీలు మంగళవారం నాడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com