టర్కీ పాక్‌కు మద్దతివ్వడాన్ని మరోసారి పరిశీలించుకోవాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. టర్కీకి భారత్‌తో చాలా చారిత్రాత్మక సంబంధాలున్నాయన్నారు. పాకిస్థాన్ కంటే భారత్‌లోనే ఎక్కువగా ముస్లింలు ఉన్నారన్నారు. ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో టర్కీ పాకిస్థాన్‌కు సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టర్కీ పాక్‌కు మద్దతివ్వడాన్ని మరోసారి పరిశీలించుకోవాలని సూచించారు. ” టర్కీకి భారత్‌తో చాలా చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. దాదాపు 20 కోట్లకు పైగా ముస్లింలు భారత్‌లో ఉన్నారన్న విషయం టర్కీకి నిరంతరం గుర్తుచేయాల్సిన అవసరం ఉంది.
పాకిస్థాన్ కంటే ఇండియాలోనే ఎక్కువగా ముస్లింలు ఉన్నారు. పాకిస్థాన్ ఇప్పటివరకు వ్యవహరించిన తీరును చూస్తే.. వాళ్లకి ఇస్లాంతో సంబంధం లేదని” అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇదిలాఉండగా పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచానికి వివరించేందుకు కేంద్రం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ టీమ్‌లో ఇప్పుడు అసుదుద్దీన్ ఓవైసీ కూడా చేరారు. తాను ఉన్న టీమ్‌కు తన స్నేహితుడు బైజంత్ జై పండా నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. తమ గ్రూప్ యూకే, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, ఇటలీ అలాగే డెన్‌మార్క్ దేశాలకు వెళ్తుందని చెప్పారు. దీనికి ఏ పార్టీతో సంబంధం లేదని అన్నారు. అలాగే తాము విదేశాలకు బయలుదేరేముందుు మరిన్ని విషయాలు పంచుకుంచామని పేర్కొన్నారు. తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తానని స్పష్టం చేశారు.