విలక్షణ దర్శకుడు నిత్యప్రయోగశాలి డాక్టర్ పిసి ఆదిత్య కు బెంగళూరుకు చెందిన ప్రముఖ సాంస్కృతిక సంస్థ ఇండియన్ ఆర్ట్స్ అవార్డు 20 25 అందజేశారు. సినీ దర్శకుడిగా డాక్టర్ పి సి ఆదిత్య గత 30 సంవత్సరాలుగా తెలుగు సినీ రంగానికి ఎంతోమంది నూతన నటీనటులను సాంకేతిక నిపుణులను పరిచయం చేస్తూ కొత్తవారిని ప్రోత్సహిస్తున్నారు. నిత్య ప్రయోగశీలిగా అందరి అభినందనలు పొందుతూ గత 30 సంవత్సరాలుగా అలుపెరుగని సినీ ప్రయాణాన్ని సాగిస్తూ ఇప్పటికే సుమారు పది పూర్తిస్థాయి సినిమాలకు దర్శకత్వం వహించి ఎంతోమంది కొత్తవారికి అవకాశం కల్పించారు అదే రీతిలో సుమారు 150 లఘు చిత్రాలకు దర్శకత్వం వహించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే సుమారు 200 పైగా అవార్డులు రికార్డులు సాధించి ప్రపంచ స్థాయిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. పిసి ఆదిత్య అందిస్తున్న నిరంతర సినీ సేవలను గుర్తించినటువంటి బెంగళూరుకు చెందినటువంటి ప్రముఖ సంస్కృతిక సంస్థ ఇండియన్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు పంకజ్ కుమార్ మరియు కార్యదర్శి ఆనంద ప్రభాకర్ సంయుక్తంగా ఈ సర్టిఫికెట్ ఆదిత్య కు అందజేశారు. త్వరలోనే ఆదిత్యను బెంగళూరులో తమ సంస్థ కార్యాలయంలో సత్కరించనున్నామని తెలియజేశారు.